How To Change Navigation key style on andriod
మన మొబైల్ లో ఏదైనా ఆప్షన్ ని ఓపెన్ చేసినప్పుడు, వెనక్కి వెళ్ళడానికి అలాగే మన మొబైల్ లో ని రీసెంట్ ఫైల్స్ ఓపెన్ చేయడానికి, మనం ఏదైనా వెబ్ సైట్ లో ఉన్నప్పుడు, దానినుండి వెంటనే బయటికి రావడానికి, అలాగే మన మొబైల్ లో చాలా రకాల ఆప్షన్స్ ని ఉపయోగించడానికి మన మొబైల్ లో ని నావిగేషన్ బటన్స్ ని వాడుతూ ఉంటాము. అయితే ఆ నావిగేషన్ బటన్ మనకు అన్ని మొబైల్లో ఒకే మాదిరిగానే ఉంటాయి, మనం ఆ నావిగేషన్ బటన్స్ ని మరియు వాటి యొక్క స్టైల్ ని మార్చుకోవడానికి మొబైల్ లో ఎలాంటి ఆప్షన్ ఉండదు, అలాగే ఆ బటన్స్ ని మనకు కావలసిన విధంగా సెట్ చేసుకోడానికి కూడా మనకు మొబైల్ లో ఆప్షన్స్ ఉండవు.
కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిప్ ను ఉపయోగించి మీ మొబైల్ లోని నావిగేషన్ బటన్స్ ని మీకు నచ్చిన స్టైల్ లోకి మార్చుకోవచ్చు మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగ అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
దీని కొరకు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడనుండి ఇన్స్టాల్ చేసుకోండి.
ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది వాటిని ఇచ్చేయండి, వెంటనే ఈ యాప్ మీకు ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత నావిగేషన్ బటన్స్ యొక్క స్టైల్ మార్చుకోవడానికి, అందులో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి మీకు కావలసిన విధంగా మీ నావిగేషన్ బటన్ మరియు వాటి యొక్క కలర్ మార్చుకోవచ్చు.
పూర్తి వివరాలు కింద ఉన్న వీడియోలు ఇచ్చాను అందులో చూసి తెలుసుకోండి.
1 Comments
Dileep
ReplyDelete