How to make Video with Images With Extra Effect and Music in Mobile
మనం ప్రతిరోజు వాట్సాప్ లో చాలా రకాల స్టేటస్ వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాము. అయితే అందులో కొన్ని సినిమాలకు సంబంధించిన వీడియోస్ మరియు మనం వేరే సోషల్ మీడియా యాప్స్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియోస్ వాట్సాప్ స్టేటస్ గా పెడుతూ ఉంటాము. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్ ను ఉపయోగించి మీరు మీయొక్క ఫొటోస్ తో అదిరిపోయే స్టేటస్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆ వీడియోస్ పైన మీకు నచ్చిన ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే మీకు నచ్చిన పాటను బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే విధంగా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, అది ఎలాగ అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడనుండి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి, ఓపెన్ చేయగానే అందులో మీకు చాలా రకాల కేటగిరిస్ కనిపిస్తాయి, అందులో నుండి మీరు డైనమిక్ స్టిక్కర్స్ అనే ఆప్షన్ ని ఓపెన్ చేయండి.
వెంటనే మీ మొబైల్ లోని ఫొటోస్ మరియు వీడియోస్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది. అందులోనుండి మీరు ఏ ఫోటోని ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో దాని మీద ప్రెస్ చేయండి వెంటనే ఆ ఫోటో ఈ అప్ లోకి వస్తుంది. తర్వాత మీ కింద చాలా రకాల ఎఫెక్ట్స్ కనిపించడం జరుగుతుంది.
మీకు నచ్చిన ఎఫెక్ట్ మీద మీరు ప్రెస్ చేయగానే వెంటనే ఎఫెక్ట్స్ అనేది మీయొక్క ఫోటో కి అప్లై కావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఈ అప్ లో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి వాటిని ఉపయోగించి మీయొక్క ఫోటో ని ఒక అందమైన వీడియో లాగా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే అందులో మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది దానిమీద ప్రెస్ చేసి మీకు నచ్చిన పాటను ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో సెట్ చేసుకోవచ్చు. మీరు ఇందులో ఉన్న ఆప్షన్ని ఉపయోగించి ఒక వీడియో క్రియేట్ చేసిన తర్వాత పైన మీకు రైట్ మార్క్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి మీ వీడియో కొంచెం ప్రాసెసింగ్ అవుతుంది తర్వాత కింద మీకు సేవ్ ఆప్షన్ వస్తుంది.
దానిమీద ప్రెస్ చేయగానే ఆటోమెటిగ్గా మీకు సేవ్ వీడియో అనే ఆప్షన్ వస్తుంది మళ్లీ దాన్ని ప్రెస్ చేయండి ఆటోమేటిగ్గా ఆ వీడియో మీ మొబైల్ లో సేవ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ ఫొటోస్ తో ఒక అందమైన వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు.
ఈ యాప్ ని ఎలా వాడాలో తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న వీడియోని చూడండి.
0 Comments