Whatsapp Secret Chatting Tips & Tricks that you should know in 2022
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడటం అనేది సాధారణం అయిపోయింది, అయితే మనం కొన్ని సార్లు మన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరికైనా సరే మనం వాట్సాప్ లో మనకు సంబంధించిన సీక్రెట్ మెసేజ్ పంపించినట్లు అయితే అవతల వాళ్ళ మొబైల్ వేరే వాళ్ల దగ్గర ఉన్నప్పుడు, ఆ మొబైల్ లాక్ తీయక పోయినా సరే లాక్ స్క్రీన్ మీద మనం పంపించిన మెసేజ్ కనిపించడం జరుగుతుంది. అలాగే మనం మొబైల్ లాక్ ఓపెన్ చేసి అందులో వేరే యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు, ఎవరైనా మెసేజ్ పంపించిన సారే, వాళ్లు పంపించిన మెసేజ్ అనేది మనకు నోటిఫికేషన్ లో కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల మన పక్కన ఉన్న వాళ్లు కూడా ఆ మెసేజ్ చదువుతూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్ మీరు ఉపయోగిస్తే మీరు వాట్సాప్ లో ఏ మెసేజ్ పంపించిన సరే అవతలి వాళ్ళ మొబైల్లో లాక్ స్క్రీన్ మీద అలాగే నోటిఫికేషన్లో కనిపించడం జరగదు.
దానిని వాళ్లు చదవాలంటే వాట్సప్ ఓపెన్ చేసి మెసేజ్ కింద ఉన్న రీడ్ మోర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మాత్రమే ఆ మెసేజ్ కనిపిస్తుంది. మీరు కూడా అలా ఎలా పంపాలి అనేదాని గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడనుండి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే పైన మీకు టైటిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
అక్కడ మీరు ఏదైనా ఒక టైటిల్ ఎంటర్ చేయండి తర్వాత కింద మీకు హైడ్ మెసేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీరు ఏ మెసేజ్ అయితే పంపాలనుకుంటున్నారో దాన్ని టైప్ చేయండి. తర్వాత కింద మీకు క్లిప్ బోర్డ్ కాఫీ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిమీద ప్రెసిడెంట్ ఆ మెసేజ్ మొత్తం మీకు కాఫీ అవుతుంది తర్వాత దానిని మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో పంపియండి. ఆ మెసేజ్ అవతల వాళ్ళకి వెళ్తుంది కానీ వాళ్లకు కేవలం నోటిఫికేషన్లో మీరు టైప్ చేసిన టైటిల్ మాత్రమే కనిపిస్తుంది మెసేజ్ కనిపించదు వాళ్ళు దాన్ని చదవాలంటే వాట్సప్ ఓపెన్ చేసి రీడ్ మోర్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మాత్రమే ఆ మెసేజ్ కనిపిస్తుంది ఈ విధంగా మీరు ఈ యాప్ ని ఉపయోగించి వాట్సాప్ లో సీక్రెట్ గా చాటింగ్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
0 Comments