Easy Way To Understand English Using Android Mobile in 2022
మనకు ఇంగ్లీష్ చదవడం రాయడం రానప్పుడు, మనకు ఎవరైనా ఇంగ్లీషులో మెసేజ్ పంపించినట్లు అయితే దాన్ని చదవడం మనకు చాలా కష్టం అవుతుంది, అలాగే వాళ్లకు ఇంగ్లీషులో రిప్లై ఇవ్వాల్సి వస్తే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు ఇంగ్లీష్ రాదు కాబట్టి. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్ ను ఉపయోగించి మీరు మీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే అవతలి వాళ్లకు మీరు ఇంగ్లీషులో మెసేజ్ పంపించవచ్చు, అలాగే వాళ్ళు పంపించిన ఇంగ్లీష్ మెసేజ్ ను కూడా ఒక్క క్లిక్ తో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చదవచ్చు అది ఎలాగని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఉంటుంది దానికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడనుండి మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మిమ్మల్ని కొన్ని పర్మిషన్ అడుగుతుంది వాటిని ఇచ్చేయండి, వెంటనే ఆ యాప్ అనేది మీకు ఓపెన్ కావడం జరుగుతుంది.
ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరు చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి, అందులో మీరు క్విక్ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ని ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి మీరు ఒక సైడ్ తెలుగు మరో సైడ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి అలాగే పైన మీకు ఆన్ బటన్ కనిపిస్తుంది దాన్ని ఆన్ చేయండి తర్వాత మీకు మొబైల్ కు సైడ్ చిన్న రౌండ్ సింబల్ రావడం జరుగుతుంది.
మీరు ఏ మ్యాటర్ అయితే తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారో ఆ మేటర్ ఓపెన్ చేసి సైడ్ ఉన్న రౌండ్ సింబల్ మీద ప్రెస్ చేయగానే మీకు హాయ్ అని రౌండ్ సింబల్ వస్తుంది దాన్ని మీరు యొక్క మ్యాటర్ మీదికి స్క్రోల్ చేయగానే ఆ మేటర్ అనేది తెలుగులో ఉంటే ఇంగ్లీష్ లోకి ఇంగ్లీష్ లో ఉంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ కావడం జరుగుతుంది.
ఈ విధంగా మీరు ఈ ట్రిక్ ను ఉపయోగించి మీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే ఇంగ్లీష్ పదాలను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చదవొచ్చు. అలాగే తెలుగు పదాలని ఇంగ్లీష్ లోకి మార్పు చేసి అవతలి వాళ్ళకి పంపవచ్చు.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
0 Comments