how to Change Navigation Bar Animation effects in 2022
మనం ప్రతి రోజూ వాడే స్మార్ట్ ఫోన్ లో చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి, వాటిని ఉపయోగించుకొని మనం మన మొబైల్ ని మనకు కావలసిన విధంగా మార్చుకోవచ్చు, అలాగే కొన్ని రకాల యాప్స్ ని ఉపయోగించి మన మొబైల్ యొక్క హోం స్క్రీన్ స్టైల్ ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాల ఆప్షన్స్ అనేవి మన స్మార్ట్ ఫోన్ లో ఉంటాయి కానీ, మన మొబైల్ లో ని నావిగేషన్ బటన్స్ యొక్క స్టైల్ చేంజ్ చేసుకోవడానికి డిఫాల్ట్ గా అయితే అలాంటి ఆప్షన్ అయితే ఉండదు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక యాప్ ను ఉపయోగించి మీరు మీ మొబైల్ లో ఉండే నావిగేషన్ బటన్స్ యొక్క స్టైల్ ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు మీ నావిగేషన్ బటన్స్ మీద ప్రెస్ చేసిన ప్రతిసారి మీకు బ్యాక్ గ్రౌండ్ లో ఒక ఎఫెక్ట్ అనేది వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు అది ఎలాగని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
ఈ యాప్ కు సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడి నుండి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మిమ్మల్ని కొన్ని అనుమతులు అడుగుతుంది వాటిని ఇచ్చేయండి, వెంటనే ఈ యాప్ మీకు ఓపెన్ అవుతుంది తర్వాత ఇందులో మీకు చాలా రకాల కేటగిరిలో మీకు నావిగేషన్ కి ఒక బ్యాక్ గ్రౌండ్ లో లైటింగ్ ఎఫెక్ట్స్ వచ్చేలా చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి.
వాటిలో మీకు కావాల్సిన దానిని ఓపెన్ చేసి అందులో కింద కనపడే, రాండం అనిమేషన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి, తర్వాత వెనక్కి వచ్చి పైన కనపడే నావిగేషన్ బార్ యానిమేషన్స్ అనే ఆప్షన్ ని ఆన్ చేయండి తర్వాత నుండి మీరు మీ మొబైల్ యొక్క నావిగేషన్ బటన్స్ మీద ప్రెస్ చేసిన ప్రతిసారి మీరు ఇంత ముందు కు సెట్ చేసుకునే ఎఫెక్ట్స్ అనేవి బ్యాక్ గ్రౌండ్ లో రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ మొబైల్ నుండి నావిగేషన్ బటన్స్ యొక్క స్టైల్ ని చేంజ్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి
0 Comments