How to Download New Ration Card online in Telangana

How to Download New Ration Card online in Telangana


మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు వాళ్ళు ఇచ్చే సబ్సిడీ రేషన్ బియ్యం లేదా ఇతర సామాన్లు మనం తీసుకోవాలనుకుంటే కచ్చితంగా మన దగ్గర రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మన రేషన్ కార్డు ఎక్కడైనా సరే పోగొట్టుకుంటూ ఉంటాం, లేదా కొన్ని అత్యవసర సమయాలలో మన రేషన్ కార్డు అనేది మనకు దొరకదు. అలాంటప్పుడు ఒక్క నిమిషంలో మన మొబైల్ లో ఆ రేషన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. దాని కొరకైతే మీ దగ్గర మీ రేషన్ కార్డు సంబంధించిన నెంబర్ ఉండాల్సి ఉంటుంది.
దీని కొరకు ముందు మీరు మీ మొబైల్లో ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ కు సంబంధించింది. ఆ వెబ్సైట్ కు సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను, అక్కడినుండి మీరు క్రోమ్ బ్రౌజర్ లో ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేసి, మీ బ్రౌజర్ ని డెస్క్ టాప్ మోడ్ లోకి మార్చుకోండి. తర్వాత మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి, అందులో మీకు చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి, అందులో మొదటగా మీరు చూసుకున్నట్లయితే   FSC search అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేయండి. 
తర్వాత పేజీలో మీకు రేషన్ కార్డ్ సెర్చ్ అని ఆప్షన్ వస్తుంది అందులో మీరు రేషన్ కార్డ్ సెర్చ్ లో FSC సెర్చ్ అనే ఆప్షన్ ని ఓపెన్ చేయండి, తర్వాత మీకు ఒక డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది, అందులో మీరు చూసుకున్నట్లయితే చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ లలో పైన మీకు రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిమీద ప్రెస్ చేయండి, కింద మీకు ఒక చిన్న వైట్ బాక్స్ వస్తుంది. అందులో మీ రేషన్ కార్డుకు సంబంధించిన నెంబర్ ఎంటర్ చేయండి, నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనే కనపడే సెర్చ్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి వెంటనే మీకు సంబంధించిన రేషన్ కార్డు అనేది అక్కడ రావడం జరుగుతుంది. ఆ రేషన్ కార్డులో మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి.మీరు కావాలనుకుంటే దాన్ని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రేషన్ షాపులో చూపించినట్లయితే మీకు వాళ్లు మీకు సంబంధించిన అన్ని రేషన్ వస్తువులు ఇవ్వడం జరుగుతుంది.

పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.



Reactions

Post a Comment

0 Comments