How To Send Whatsapp Photos with Password in 2022

How To Send Whatsapp Photos with Password in 2022

నార్మల్ గా మనం వాట్సాప్ నుండి ప్రతిరోజు మన ఫ్రెండ్స్ కు లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ కు వాట్సాప్ నుండి చాలా రకాల ఫొటోస్ అనేవి పంపుతూ ఉంటాము. కానీ కొన్నిసార్లు మనకు సంబంధించిన సీక్రెట్ ఫొటోస్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము, అలా షేర్ చేసినప్పుడు, అవతల వాళ్ళ మొబైల్,  వాళ్ల దగ్గర లేకుండా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు ఎవరైనా తీసుకున్నప్పుడు, వాళ్లు వాట్సప్ ఓపెన్ చేసి చూసినట్లయితే, మనం పంపించిన ఆ సీక్రెట్ ఫొటోస్ అనేవి వేరే వాళ్లకు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ ఉపయోగిస్తే మీరు మీరు అవతల వాళ్లకు పంపించే మీ సీక్రెట్ ఫొటోస్ కి, సీక్రెట్ లాక్ అనేది సెట్ చేసి పంపించవచ్చు. ఆ ఫొటోస్ ఎవరు ఓపెన్ చెయ్యాలనుకున్న సరే, మీరు సెట్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మాత్రమే ఆ ఫొటోస్ ఓపెన్ కావడం జరుగుతుంది. అది ఎలాగ అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడ నుండి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ మీరు మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. అందులో మీకు కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి మీకు అక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని మీరు ఓపెన్ చేసినట్లయితే మీ మొబైల్ లోని, ఫొటోస్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది. 
మీరు అవతలి వాళ్లకు ఏ ఫోటో అయితే పంపించాలనుకుంటున్నారా ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, పైన మీకు డన్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి, వెంటనే ఆ ఫోటో ఈ అప్లికేషన్ లోకి వస్తుంది. 
తరవాత పైన మీకు ఒక పిడిఎఫ్ సింబల్ కనిపిస్తుంది దానిమీద ప్రెస్ చేయండి, మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి అందులో ముందుగా ఎంటర్ యువర్ నేమ్ అని ఉంటుంది అక్కడ మీ పేరు ఎంటర్ చేయండి. 
తర్వాత పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేసి మీరు ఆ ఫోటోకి ఏ పాస్వర్డ్ పెట్టి పంపించాలనుకుంటారో ఆ పాస్వర్డ్ మీరు అక్కడ ఎంటర్ చేయండి, మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత కింద ఓకే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి వెంటనే మీకు ఒక పిడిఎఫ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. 


అక్కడ నుండి డైరెక్ట్ గా మీరు షేర్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి వాట్సాప్ లో మీకు కావలసిన వాళ్లకు పంపించుకోవచ్చు. వాళ్లకు పంపిన తర్వాత వాళ్లు దాన్ని ఓపెన్ చేసినట్లయితే, మీరు సెట్ చేసిన పాస్వర్డ్ అడుగుతుంది, దాన్ని మీరు వాళ్లకు చెప్పాల్సి ఉంటుంది. 
వాళ్లు ఆ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేయగానే ఆ ఫోటో ఓపెన్ అవుతుంది అక్కడి నుండి వాళ్ళు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు పంపిన ఫోటో యొక్క క్వాలిటీ అనేది తగ్గకుండా ఒరిజినల్ క్వాలిటీలో ఆ ఫోటో అవతలి వాళ్లకు వెళుతుంది.

పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.

App Details
1. App name: Image to PDF - PDF Maker
2. Rating: 4.5
3. users: 5,000,000+
4. app review: 23.8K
APP LINK



Reactions

Post a Comment

0 Comments