How to Use your Smartphone as a Mic for Bluetooth Speakers
ప్రతిరోజు మనం మన మొబైల్ ని మన ఇంట్లో ఉన్న బ్లూటూత్ స్పీకర్స్ కావచ్చు, లేదా బ్లూటూత్ హోమ్ థియేటర్స్ కి, యాంప్ ప్లేయర్స్ కి కనెక్ట్ చేసి పాటలనేవి వింటూ ఉంటాము. కొన్నిసార్లు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా లేదా ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు మనం మైక్ లో అనౌన్స్మెంట్ ఇవ్వాలంటే కచ్చితంగా మనం మైక్ వాడాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కొన్నిసార్లు మన ఇంట్లో ఉన్న హోమ్ థియేటర్స్ కి మైక్ కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండదు, ఒకవేళ ఆప్షన్ ఉన్న మన దగ్గర మైక్ అనేది ఉండదు, కాబట్టి ఇప్పుడు నేను మీ మొబైల్ నే ఒక వైర్లెస్ మైక్ లాగా ఎలా మీ ఇంట్లో ఉన్న బ్లూటూత్ డివైసెస్ కి కనెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను.
దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడ నుండి మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక రెండు ఆప్షన్స్ వస్తాయి అందులో ఒకటి Aux మరియు రెండవది బ్లూటూత్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో మీరు బ్లూటూత్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీరు మీ మొబైల్ ని మీ యొక్క బ్లూటూత్ డివైసెస్ కి కనెక్ట్ చేయండి, కనెక్ట్ చేశాక మీకు ఒక మైక్ సింబల్ వస్తుంది ఆ సింబల్ పైన మీకు రెడ్ కలర్ లో ఒక బటన్ కనిపిస్తుంది, దానిమీద ప్రెస్ చేయండి మిమ్మల్ని కొన్ని అనుమతులు అడుగుతుంది, వాటిని చేయండి వెంటనే మీ మొబైల్ లో మైక్ అనేది యక్టివేట్ అవుతుంది.
ఇకనుండి మీరు మీ మొబైల్లో ఏం మాట్లాడినా ఆ వాయిస్ మొత్తం మీరు కనెక్ట్ చేసిన డివైస్ హోమ్ థియేటర్ కావచ్చు లేదా బ్లూటూత్ స్పీకర్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అందులో వినిపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ మీ మొబైల్ లో ఈ యాప్ ని ఉపయోగించి మీ మొబైల్ ని ఒక మైకు లాగా మార్చుకోవచ్చు. మీరు స్పెషల్గా ఒక మైక్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
0 Comments