How to hide images and videos in mobile dial pad
♦️మీ మొబైల్ లో, మీకు సంబంధించిన చాలా రకాల సీక్రెట్ ఫొటోస్, మరియు వీడియోస్ ఉంటాయి. కానీ మీరు చాలా సార్లు ఎవరైనా చూస్తారేమో అని భయపడుతూ ఉంటారు.
♦️కానీ, నేను చెప్పే ఈ యాప్ ను ఉపయోగించి, మీరు మీకు సంబంధించిన మీ సీక్రెట్ ఫొటోస్, మరియు వీడియోస్ మీ మొబైల్ యొక్క డైలర్ ప్యాడ్ లో దాచుకోవచ్చు.
♦️ ఈ యాప్ కి సంబంధించిన లింకు కింద ఇచ్చాను. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి.
♦️ అప్లికేషన్ వివరణ:
♦️ ఈ యాప్ మీకు ప్లే స్టోర్ లో లభిస్తుంది. దీని పేరు dialler vault. దీనిని మీరు ఓపెన్ చేయగానే, పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. మీకు సంబంధించిన ఏదైనా ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి.
♦️తర్వాత Default డైలర్ ప్యాడ్,గా ఈ యాప్,ని మీరు సెట్ చేసుకోండి. తర్వాత మీరు డైలర్ ప్యాడ్ లో సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో, దాన్ని అక్కడ ఎంటర్ చేయండి.
♦️ఎంటర్ చేయగానే, ఆటోమేటిక్ గా మీకు హిడెన్ ఫైల్స్ దాచుకునే పేజీ ఓపెన్ కావడం జరుగుతుంది.
♦️ అక్కడ మీకు యాడ్ ఫైల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా, మీకు మీ మొబైల్ లోని గ్యాలరీ ఓపెన్ కావడం జరుగుతుంది.
♦️అందులో మీరు ఏ వీడియో లేదా ఫోటో హైడ్ చేసి, ఈ యాప్ లో దాచుకోవాలి అనుకుంటున్నారో, దాని మీద ప్రెస్ చేయండి.
♦️వెంటనే ఆటోమేటిక్ గా, ఆ ఫైల్ అనేది ఈ యాప్ లోకి సేవ్ కావడం జరుగుతుంది. తర్వాత మీ మొబైల్ గ్యాలరీ లో ఆ వీడియో లేదా ఫోటో కనిపించడం జరగదు.
♦️మీరు ఈ డైలర్ ప్యాడ్ యాప్ ఓపెన్ చేసి, మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మాత్రమే, ఈ యాప్ ఓపెన్ కావడం జరుగుతుంది. తర్వాత మీరు ఈ యాప్ లో, మీరు దాచుకున్న వీడియో లేదా ఫొటోస్ అన్నీ చూడవచ్చు. ఈ విధంగా మీరు మీకు సంబంధించిన సీక్రెట్ ఫొటోస్ మరియు వీడియోస్ అనేవి ఈ యాప్ లో దాచుకోవచ్చు.
3 Comments
Bunny
ReplyDeletePrasad
ReplyDeletePp
ReplyDelete