How To Hide Photos And Videos on Mobile Calculator app
సాధారణంగా మనం మన మొబైల్ లో చాలా రకాల సీక్రెట్ ఫొటోస్ మరియు వీడియోస్ అనేవి ఉంచుకుంటాము. అలాగే కొన్ని సార్లు మన మొబైల్ బ్రౌజర్ లో కొన్ని సీక్రెట్ వెబ్ సైట్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటాం, కొన్ని సీక్రెట్ యాప్స్ కూడా మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటాం, అయితే మన మొబైల్ మనకు తెలియకుండా ఎవరైనా తీసుకున్నట్లయితే మనకు సంబంధించిన సీక్రెట్ ఫొటోస్ వీడియోస్ అలాగే మనం బ్రౌజర్ లో ఏం వెబ్ సైట్స్ ఓపెన్ చేస్తున్నాము, మన మొబైల్లో ఎలాంటి సీక్రెట్ యాప్స్ వాడుతున్నాము అనేది తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్ మీరు ఉపయోగిస్తే మీరు మీ మొబైల్ లో సీక్రెట్ ఫొటోస్ వీడియోస్, బ్రౌజర్ యాప్స్, అన్నీ కూడా వేరే వాళ్లకు కనిపించకుండా ఈ మొబైల్ యొక్క క్యాలిక్యులేటర్ లో దాచి పెట్టుకోవచ్చు. అది ఎలాగని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.వివరణ
దీని కొరకు మీరు మీ మొబైల్లో క్యాలిక్యులేటర్ అనే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.
ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి, మీకు ఈ యాప్ మనం డైలీ వాడే క్యాలిక్యులేటర్ యాప్ లాగానే ఉంటుంది అలాగే ఇందులో మనం లెక్కలు కూడా చేసుకోవచ్చు, కానీ ఇందులో మనకు సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ దాచుకోవడం కొరకు అయితే, ఈ యాప్ ఓపెన్ చేయగానే మీకు క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది, అందులో మీరు ఏదైనా ఒక నాలుగంకెల సీక్రెట్ పిన్ ఎంటర్ చేయండి, తర్వాత ఈక్వల్ మీద ప్రెస్ చేయండి వెంటనే ఈ యాప్ మీకు ఓపెన్ అవుతుంది, అందులో మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి.
యాప్ లాక్ ఆప్షన్ ఉంటుంది దాన్ని ఉపయోగించి మీరు మీ మొబైల్ లో ని యాప్స్ ని హైడ్ చేసుకోవచ్చు, అలాగే అందులో సీక్రెట్ బ్రౌజర్ ఉంటుంది ఆ బ్రౌజర్ లో మీకు నచ్చిన వెబ్ సైట్ ని ఓపెన్ చేసి చూడొచ్చు. మీకు ఫొటోస్ మరియు వీడియోస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అందులో మీకు సంబంధించిన ఫొటోస్ మరియు వీడియోస్ మొబైల్ కి ఒక గ్యాలరీ నుండి హైడ్ చేసి ఇందులో దాచుకోవచ్చు.
యాప్ ని మీరు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న వీడియో చూడండి
2 Comments
Super
ReplyDeleteManasa
ReplyDelete